Wild Elephant into Village: దారితప్పి జనావాసాల్లోకి అడవి ఏనుగు.. బంధించి తీసుకెళ్లే పనిలో అటవీ అధికారులు.. (వైరల్ వీడియో)
సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వచ్చి తిరుగుతోంది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Newdelhi, Feb 3: ఓ అడవి ఏనుగు (Wild Elephant) దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. సమీప అటవీ ప్రాంతం (Forest) నుంచి గ్రామాల్లోకి (Villages) వచ్చి తిరుగుతోంది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగు ఎటు నుంచి ఎటొచ్చి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. మరోవైపు పంట చేలను కూడా ఆ గజరాజు ధ్వంసం చేస్తోంది. కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలోని మనంతవాడి పట్టణంలో ప్రస్తుతం ఏనుగు తిరుగుతోంది. ఏనుగుకు మత్తుమందు ఇచ్చి బంధించి, ఆ తర్వాత అడవిలో విడిచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)