Pawan Kalyan (Photo-X/Janasena)

Vijayawada, Feb 25: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట (Elephant Attack) ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ స్పందించారు.  ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తెలుసుకొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)

అసలేం జరిగిందంటే?

అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై మంగళవారం ఉదయం ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వై. కోటకు చెందిన కొందరు భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగుల గుంపు దాడికి పాల్పడినట్టు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. ఏనుగుల గుంపు దాడి బాధితులంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానికులు దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భక్తులపై దాడి చేసిన ఏనుగుల గుంపు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం