Accident Caught on Camera: వీడియో ఇదిగో, కాంపౌండ్‌లో ఆడుకుంటుండగా ఏడేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన కారు, బాలుడికి కనీసం సహాయం కూడా చేయలేదని తల్లి ఆవేదన
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్‌లోని ఇంటర్‌ఫేస్ హైట్స్ సొసైటీ లోపల జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది, అక్టోబర్ 19న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు కారు ఢీకొని నలిగిపోతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్‌లోని ఇంటర్‌ఫేస్ హైట్స్ సొసైటీ లోపల జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది, అక్టోబర్ 19న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు కారు ఢీకొని నలిగిపోతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. సొసైటీ కార్యదర్శి భార్య శ్వేతా శెట్టి రాథోడ్ నడిపిన వాహనం.. ఆ పిల్లవాడు కాంపౌండ్‌లో ఆడుకుంటుండగా అతని కాలు మీద నుంచి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అన్వే మజుందార్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనం నడుపుతున్నాడని అతని తల్లి మహువా మజుందార్ ఆరోపించింది. సంఘటన తర్వాత బాలుడికి కనీసం సహాయం కూడా చేయలేదని పేర్కొంది. ఫిర్యాదు మేరకు, బంగూర్ నగర్ పోలీసులు IPC సెక్షన్ 281, సంబంధిత మోటార్ వాహనాల చట్టం నిబంధనల కింద FIR నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు CCTV ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు.
Accident Caught on Camera in Malad:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)