Aghora Perform Pooja Sitting On Dead Body: వీడియో ఇదిగో, శ్మశానంలో శవంపై కూర్చుని అఘోర పూజలు

తమిళనాడులోని సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Aghora Perform Pooja Sitting On Dead Body (Photo-Video Grab)

తమిళనాడులోని సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం అంత్యక్రియల కోసం సోమవారం సూలూర్‌ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో పాటు 8 మంది అఘోరాలు కూడా వచ్చారు.

మృతదేహాన్ని దహనం చేసేముందు అఘోర ఆ శవంపై కూర్చొని పూజలు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో మీడియా ప్రతినిధులు శ్మశాన నిర్వాహకుడు సురేష్ను ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే బంధువుల అనుమతితోనే అఘోర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement