Allu Arjun on Sandhya Theatre Stampede: వీడియో ఇదిగో, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేసింది, అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్ళను థియేటర్లోనే వదిలి వెళ్ళను కదా అంటే అల్లు అర్జున్ ఎమోషన్

నేను రోడ్డు షో చేయలేదు. నాకు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమని చెప్పారు అనేది పచ్చి అబద్దం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏ పోలీస్ వాళ్ళు ఏమీ చెప్పలేదు. మా మేనేజర్ వాళ్ళు వచ్చి బైట ఓవర్ క్రౌడ్ ఉంది మీరు వెళ్లిపోండి అంటే వెళ్ళిపోయా.నా భార్య, పిల్లలు నా పక్కనే ఉన్నారు.. అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్ళను థియేటర్లోనే వదిలి వెళ్ళను కదా.

Allu Arjun on Sandhya Theatre stampede (Photo-Video Grab)

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తనను కలచివేసిందని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

వీడియో ఇదిగో, పోలీసుల పర్మిషన్ ఇస్తే నాకు క్షణంలో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లాలని ఉంది, భావేద్వేగానికి గురైన అల్లు అర్జున్, మా నాన్న కూడా పోలీసుల దగ్గర గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చిందంటూ..

నేను రోడ్డు షో చేయలేదు. నాకు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమని చెప్పారు అనేది పచ్చి అబద్దం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏ పోలీస్ వాళ్ళు ఏమీ చెప్పలేదు. మా మేనేజర్ వాళ్ళు వచ్చి బైట ఓవర్ క్రౌడ్ ఉంది మీరు వెళ్లిపోండి అంటే వెళ్ళిపోయా.నా భార్య, పిల్లలు నా పక్కనే ఉన్నారు.. అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్ళను థియేటర్లోనే వదిలి వెళ్ళను కదా. తర్వాత రోజు లేడీకి ఇలా అయిందని నాకు తెలిసింది.. నాకు తెలియగానే నేను షాక్ అయ్యా. నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ కూర్చున్న అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేసింది.

Allu Arjun on Sandhya Theatre stampede:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement