Allu Arjun: వీడియో ఇదిగో, నేను పర్మిషన్ లేకుండా వెళ్లాను అనేది పచ్చి అబద్ధం, నేను థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లే జనాన్ని క్లియర్ చేశారని తెలిపిన అల్లు అర్జున్
నేను పర్మిషన్ లేకుండా వెళ్లా అనేది పచ్చి అబద్ధం. పర్మిషన్ లేకుంటే పోలీసులే నన్ను తిరిగి పంపిస్తారు.. కానీ నేను థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లే జనాన్ని క్లియర్ చేశారని అల్లు అర్జున్ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తనను కలచివేసిందని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్లి వాళ్ళ కుటుంబాలను కలిశాను.అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? నేను వెళ్ళలేక తరువాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా.. దానికి నేను స్పందించలేదు అంటే ఎలా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. నేను పర్మిషన్ లేకుండా వెళ్లా అనేది పచ్చి అబద్ధం. పర్మిషన్ లేకుంటే పోలీసులే నన్ను తిరిగి పంపిస్తారు.. కానీ నేను థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లే జనాన్ని క్లియర్ చేశారని అల్లు అర్జున్ అన్నారు.
Allu Arjun on Sandhya Theatre stampede:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)