Allu Arjun on Victim Sritej: వీడియో ఇదిగో, నా కొడుకు ఎంతో శ్రీతేజ్ కూడా అంతే నాకు, అతనికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నామని తెలిపిన అల్లు అర్జున్

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు.

Allu Arjun and CM revanth Reddy (Photo/X/FB)

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తనను కలచివేసిందని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. నా కొడుకు ఎంతో శ్రీతేజ్ కూడా అంతే నాకు.నేను, సుకుమార్, మైత్రి ముగ్గురం కలిసి మంచి అమౌంట్ శ్రీతేజ్ పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నామని అల్లు అర్జున్ అన్నారు.

ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు, అల్లు అర్జున్ అసలు మనిషేనా?..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Allu Arjun Reacts on CM Revanth Reddy Comments on Assembly

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now