Portable Marriage Hall: కదిలే మ్యారేజి హాలు... లారీపై ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు... ఆనంద్ మహీంద్రా ఫిదా..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో పంచుకున్నారు. అది ఓ కదిలే మ్యారేజి హాలుకు సంబంధించినది.

Hyderabad, September 26: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో పంచుకున్నారు. అది ఓ కదిలే మ్యారేజి హాలుకు సంబంధించినది.  దీని వివరాల్లోకెళితే... ఓ షిప్పింగ్ కంటైనర్ ను ఫంక్షన్ హాలుగా మలిచారు. ఈ కంటైనర్ పొడవు 40 అడుగులు కాగా, ఇందులో మడతవేసేందుకు వీలున్న కొన్ని భాగాలను తెరిస్తే మరో 30 అడుగుల వరకు విస్తరిస్తుంది. దీంట్లో 200 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు. దీని లోపల ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులకు చల్లదనాన్ని అందించేందుకు దీంట్లో రెండు ఏసీలు కూడా అమర్చారు. నగరాల్లోని కల్యాణ వేదికలను తలపించేలా ఇది రిచ్ లుక్ తో కనిపిస్తుంది. వర్షాకాలంలోనూ దీంట్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఫంక్షన్లు జరుపుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా తరలించవచ్చు. ఈ మొబైల్ ఫంక్షన్ హాలు వీడియోను చూసి ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యారు. దీని రూపకర్తను కలవాలనుందని తన మనోభావాలను వెల్లడించారు. ఇది ఎంతో సృజనాత్మకంగా ఉందని కొనియాడారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement