Viral Video: వీడియో ఇదిగో, ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తయిన విద్యుత్ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కిన యువతి, ప్రియుడు ఏం చేశాడంటే..
ప్రియుడిపై కోపంతో ఓ యువతి 80 అడుగుల ఎత్తయిన విద్యుత్ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కింది. ఆమెను బుజ్జగించి కిందకు తీసుకువద్దామని చెప్పి ఆ యువకుడు కూడా టవర్ పైకి ఎక్కాడు. ఒకరి ద్వారా ఒకరికి విషయం తెలియడంతో ఆ టవర్ దగ్గరకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం గరేలా పెండ్ర మర్వాహి జిల్లాలో జరిగింది.
గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ యువతి శాంతించలేదు. పోలీసులు టవర్ పై ఉన్న జంటతో సదీర్ఘంగా చర్చలు నిర్వహించింది. వారికి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. చివరికి కొన్ని గంటల తర్వాత కిందకు దిగి వచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. యువతీ, యువకుడిని హెచ్చరించి పంపించారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయవద్దని నచ్చజెప్పారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)