Assam Floods: అస్సాం వరదల్లో వైరల్ అవుతున్న వీడియో, నడుం లోతు నీళ్లలో అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని వస్తున్న తండ్రి, ఇదే తండ్రి ప్రేమ అంటూ వైరల్

నడుములోతు నీటిలో ఒకవ్యక్తి అప్పుడే పుట్టిన నవజాత శిశువుని తీసుకుని వస్తున్నాడు. ఆ ఘటన చూస్తుంటే చిన్న కృష్ణుడిని ఎత్తుకుని యుమునా నదిని దాటిని వాసుదేవుడిలా అనిపించింది. పైగా ఆవ్యక్తి తన బిడ్డను చూసుకుని మురిసిపోతూ నడుం లోతు నీళ్లలో ఆనందంగా నడుస్తున్నాడు

Father Carries Baby In Waist-Deep Water In Flood-Hit Assam (Photo-Video Grab)

అస్సాంలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. మొత్తం 36 జిల్లాలకు గానూ సుమారు 32 జిల్లాలు ఈ వరదలకు ప్రభావితమయ్యాయి. పైగా వరదలు, కొండచరియలు విరిగి పడటంతో దాదాపు 30 మంది మరణించారు.ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న విషాదకర ఘటనలను వీడియో తీస్తుంటే...ఒక ఆశ్చర్యకరమైన ఘటన వీడియోలో బంధింపబడింది. అందులో నడుములోతు నీటిలో ఒకవ్యక్తి అప్పుడే పుట్టిన నవజాత శిశువుని తీసుకుని వస్తున్నాడు. ఆ ఘటన చూస్తుంటే చిన్న కృష్ణుడిని ఎత్తుకుని యుమునా నదిని దాటిని వాసుదేవుడిలా అనిపించింది. పైగా ఆవ్యక్తి తన బిడ్డను చూసుకుని మురిసిపోతూ నడుం లోతు నీళ్లలో ఆనందంగా నడుస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now