Atacama desert: నందనవనంగా మారిన అటకామా ఎడారి.. ఫోటోలు అదుర్స్..
ఎందుకంటే?
Santiago, August 26: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిగా పేరొంది, ఏడాదికి సగటు వర్షపాతం 15 మిల్లీమీటర్లు నమోదయ్యే చిలీలోని అటకామా ఎడారి నందన వనాన్ని తలపిస్తున్నది. అవును, మీరు చూస్తున్న ఫోటోలు నిజమే.. అప్పుడప్పుడూ కురిసే వర్షానికి అటకామా ఎడారి నేల మురిసిపోతుంది. విరులతో ఇలా మెరిసిపోతుంది.
ఈ చిత్రాలను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 5–7 ఏళ్లకోసారి అటకామాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటుందట. బాగుంది కదూ..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)