Earthquake (Photo Credits: X/@Top_Disaster)

Newdelhi, July 19: దక్షిణ అమెరికా దేశమైన చిలీలో (Chile) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. అర్జెంటీనా-చిలీ సరిహద్దుల్లోని అంటోఫగస్టాలో 7.3 తీవ్రతతో భూమి కంపించింది. 128 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు  యూరోపియన్‌-మెడిటేరియన్‌ సీస్మొలాజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. భూకంప ప్రభావం, ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. చిలీని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ గా (Ring of Fire) పిలుస్తారు. పసిఫిక్‌ తీరంలో ఉన్న ఈ దేశం అగ్నిపర్వతాలకు నెలవుగా ఉన్నది. దీంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.

కరెన్సీ నోట్లను చించేసిన పిల్లలపై తండ్రి కోపం.. అల్లరి మాన్పించే ప్రయత్నంలో వింత నిర్ణయం.. ఉరేసుకుంటానని హెచ్చరిక.. పొరపాటున ఉరి బిగుసుకుని మృతి.. విశాఖలో వెలుగు చూసిన ఘటన

14 ఏండ్ల కిందట..

2010లో చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం వల్ల 525 మంది మరణించారు. భూకంపం ధాటికి భారీ సునామీ కూడా వచ్చింది. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది.

వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?