Bengaluru: కోడి పుంజు కూతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంజనీర్, నా స్థలంలో కోళ్లను పెంచుకుంటే నేరమెలా అవుతుందని ప్రశ్నించిన యజమాని, బెంగుళూరులో వింత ఘటన

బెంగుళూరులో కోడిపుంజు కూతతో తన నిద్రకు ఆటంకం కలుగుతోందని ఓ ఐటీ ఇంజినీర్‌.. పోలీసులను ఆశ్రయించాడు. బెంగళూరులోని జేపీ నగర 8వ ఫేజ్‌లో ఓ అపార్టుమెంటులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడు నగర పోలీసుల ట్విట్టర్‌ అకౌంట్‌కు తన ఫిర్యాదును ట్యాగ్‌ చేశాడు.

Rooster_fight (Photo-Video Grab)

బెంగుళూరులో కోడిపుంజు కూతతో తన నిద్రకు ఆటంకం కలుగుతోందని ఓ ఐటీ ఇంజినీర్‌.. పోలీసులను ఆశ్రయించాడు. బెంగళూరులోని జేపీ నగర 8వ ఫేజ్‌లో ఓ అపార్టుమెంటులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడు నగర పోలీసుల ట్విట్టర్‌ అకౌంట్‌కు తన ఫిర్యాదును ట్యాగ్‌ చేశాడు.తమ అపార్టుమెంటు వద్ద స్థలంలో ఒక రైతు కోడిపుంజులు, కోళ్లను పెంచుతున్నాడని, కోడిపుంజులు కూత వేస్తుండటంతో నిద్రాభంగం కలుగుతోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కోళ్ల పెంపకందారుని ప్రశ్నించారు. నా స్థలంలో కోళ్లను పెంచుకుంటే నేరమా? అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు టెక్కీకి, కోళ్ల రైతుకు సర్దిచెప్పి పంపించారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement