Bengaluru: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో భరించలేని ఒంటరితనం, తట్టుకోలేక ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన మైక్రోసాఫ్ట్ ఇంజినీర్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఓ మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు, దీనికి సంబంధించి ఓ నెటిజన్ ట్వీట్ ఎక్స్ లో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ తాను కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్ తనను పిక్ చేసుకున్నాడని తెలిపారు.
ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఓ మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు, దీనికి సంబంధించి ఓ నెటిజన్ ట్వీట్ ఎక్స్ లో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ తాను కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్ తనను పిక్ చేసుకున్నాడని తెలిపారు. అతడు మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హూడీని ధరించి ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. ప్రధాని మోదీ ర్యాంప్ వాక్ వీడియో చూశారా, మహిళల దుస్తులతో పుతిన్ ర్యాంప్ వాక్ వైరల్, ఏఐ వీడియోని షేర్ చేసిన ఎలాన్ మస్క్
మెల్లిగా అతడితో మాటలు కలపగా తాను మైక్రోసాఫ్ట్ ఇంజినీర్‌నని, ఒంటరితనాన్ని భరించలేక, ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇలా వారాంతాల్లో ఆటో నడుపుతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. దీనిద్వారా ఇతరులతో మాట్లాడుతూ, ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతడు చెప్పారన్నారు. బెంగుళూరులో చాలామంది నాలాగే స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండే ఉద్యోగులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)