ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఎక్స్ తో శాధినేతలు సరదాగా ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై వీడియోని పంచుకున్నారు. ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు.
తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది. ఖైదీలు ధరించే యూనిఫాంలో చేతుల్లో బేడీలు, సీరియస్ లుక్ తో ట్రంప్ ర్యాంప్ ను అదరగొట్టారు. మహిళల దుస్తులతో పుతిన్, ట్రూడో, ఆర్మీ యూనిఫాంలో వీల్ ఛైర్ లో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, బికినీని తలపించే డ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. వజ్రాల హారాన్ని పొరపాటున చెత్తకుండీలో పడేసిన ఓనర్.. తెలియక ఆ చెత్తను తీసుకెళ్లిపోయిన మున్సిపల్ సిబ్బంది.. ఆ తర్వాత ఏమైంది?? చెన్నైలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన
బరాక్ ఒబామాను మాత్రం రంగు రంగుల దుస్తుల్లో, రాజుల కాలం నాటి సైనిక వేషధారణలో.. ఇలా రకరకాల కాస్ట్యూమ్ తో ర్యాంప్ పై నడిపించారు. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ కూడా ర్యాంప్ పై సందడి చేశారు. ఒళ్లంతా చూపించి, ఆపై స్పేస్ సూట్ ను ధరించిన ఎలాన్ మస్క్ ఠీవీగా నడిచారు.
Here's Viral Video
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk) July 22, 2024
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగిన సంగతిని చూపిస్తూ ఆ సంస్థ అధినేత బిల్ గేట్స్ చేతిలో ఓ మానిటర్ ను పెట్టి మస్క్ ర్యాంప్ వాక్ చేయించారు. దీనికి సంబధించిన వీడియో వైరల్ అవుతోంది.