Chennai, July 21: పది రూపాయలు కాదు.. వంద రూపాయలు కాదు ఏకంగా రూ. 5 లక్షల విలువజేసే ఓ వజ్రాల హారాన్ని (Diamond Necklace) ఓ వ్యక్తి పొరపాటున చెత్తలో పడేశాడు. అయితే, ఆ నెక్లెస్ ను మున్సిపల్ సిబ్బంది వెతికి తీసి.. తిరిగి ఆ యజమానికే అప్పజెప్పారు. ఈ ఆసక్తికర ఘటన చెన్నైలో తాజాగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలో దేవరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవలే ఆయన కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో అతడి తల్లి తన మనవరాలికి రూ.5 లక్షల ఖరీదైన వజ్రాల నెక్లెస్ బహుమతిగా ఇచ్చింది. అయితే, దేవరాజ్ ఏదో పనుల్లో బిజీగా ఉండి చెత్తతో పాటు పొరపాటున దాన్ని కూడా డస్ట్ బిన్ లో (Dustbin) పడేయడంతో దాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లిపోయారు.
ಕಸದ ತೊಟ್ಟಿಯಲ್ಲಿ 5 ಲಕ್ಷ ರೂ. ಮೌಲ್ಯದ ಡೈಮಂಡ್ ನೆಕ್ಲೇಸ್ ಪತ್ತೆ! ಮಾಲೀಕನಿಗೆ ಮತ್ತೆ ಸಿಕ್ಕಿತೇ? #DiamondNecklace #GarbageBin #Chennai #Jewelleryhttps://t.co/UIXEiuhP2R
— Vijayavani Digital (@Vijayavani_Digi) July 22, 2024
ఆ తర్వాత ఏమైందంటే?
ఇంట్లో వజ్రాల హారం కనిపించకపోవడంతో జరిగిన పొరపాటును గుర్తించిన దేవరాజ్ వెంటనే మున్సిపల్ సిబ్బందిని సంప్రదించారు. దీంతో సిబ్బంది సమీపంలోని చెత్తబుట్టల్లో వెతికారు. ఓ పూలదండకు చిక్కుకుని ఉన్న నెక్లెస్ ను గుర్తించి యజమానికి అందజేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.