Rameswaram Cafe Reopens: బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత తిరిగి తెరచుకున్న ‘రామేశ్వరం కేఫ్’.. జాతీయ గీతాలాపనతో పున: ప్రారంభమైన సర్వీసులు.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కస్టమర్లు.. భారీ క్యూలైన్ ఏర్పడడంతో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు.
Bengaluru, Mar 9: బాంబు పేలుడు (Bomb Blast) జరిగిన 8 రోజుల తర్వాత బెంగళూరులోని ‘రామేశ్వరం కేఫ్’ (Bengaluru Rameswaram Cafe) తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్ ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వచ్చి భారీ క్యూ లైన్ ఏర్పడడంతో బెంగళూరు పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)