Bihar: పుల్లుగా తాగి తన పెళ్లి సంగతి మరచిపోయి నిద్రపోయిన పెళ్లి కొడుకు, తెల్లారి పెళ్లి క్యాన్సిల్ అంటూ షాకిచ్చిన యువతి, బీహార్‌లో వైరల్ ఘటన

బీహార్ లో ఓ పెళ్లి కొడుకు పుల్లుగా తాగి తన పెళ్లి సంగతి మరచిపోయి నిదరపోయాడు. భాగల్‌పూర్‌లోని సుల్తాన్‌గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో వరుడు తన పెళ్లి రోజు ఆనందంతో ఫుల్‌గా మందు తాగి ఆ మత్తులో మండపానికి వెళ్లాలన్న విషయాన్ని మరచి నిద్రపోయాడు

Wedding Representational Image

బీహార్ లో ఓ పెళ్లి కొడుకు పుల్లుగా తాగి తన పెళ్లి సంగతి మరచిపోయి నిదరపోయాడు. భాగల్‌పూర్‌లోని సుల్తాన్‌గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో వరుడు తన పెళ్లి రోజు ఆనందంతో ఫుల్‌గా మందు తాగి ఆ మత్తులో మండపానికి వెళ్లాలన్న విషయాన్ని మరచి నిద్రపోయాడు. వివాహ వేదిక వద్ద వరుడి కోసం ఇరు వర్గాలు చూసి చూసి అలిసిపోయాయి. వివాహం మరుసటి నాడు స్పృహలోకి వచ్చిన వరుడు వధువు ఇంటికి చేరుకున్నాడు.పెళ్లి చేసుకుందామని అడిగాడు.

పెళ్లికూతురు పెళ్లికి నిరాకరించింది.తన బాధ్యతలను కూడా సరిగా అర్థం చేసుకోని వ్యక్తితో తన జీవితాన్ని గడపలేనని తెగేసి చెప్పింది. పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బును వరుడి కుటుంబీకులు తిరిగి ఇవ్వాలని వధువు కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వరుడి బంధువులు కొందరిని బందీలుగా చేయడంతో అక్కడి పరిస్థితి విషమించింది. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. చివరికి ఈ కేసు సద్దుమణిగినట్లు పోలీసులు తెలిపారు.

Here's VIdeo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now