Bihar: మీ కొడుకు బాడీని తీసుకువెళ్లాలంటే రూ. 50వేలు లంచం ఇవ్వాలని అడిగిన అధికారి, ఇల్లు ఇల్లు తిరిగి భిక్షాటన చేసిన తల్లిదండ్రులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో త‌ల్లిదండ్రులు భిక్షాట‌న చేశారు. ఇల్లు ఇల్లు తిరుగుతూ జోలె ప‌ట్టి అడుక్కున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి.

Bihar couple (Photo-Video Grab)

బీహార్‌లో మార్చురీ నుంచి కుమారుడి డెడ్‌బాడీని ఇచ్చేందుకు అక్క‌డ ప‌ని చేస్తున్న ఓ ఉద్యోగి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో త‌ల్లిదండ్రులు భిక్షాట‌న చేశారు. ఇల్లు ఇల్లు తిరుగుతూ జోలె ప‌ట్టి అడుక్కున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. విషాద ఘటన వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముశ్రీఘ‌ర్హార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జూన్ 6న ఓ మాన‌సిక విక‌లాంగుడు అదృశ్య‌మ‌య్యాడు. స్థానికంగానే ఆ బాలుడు చ‌నిపోయి ఉండ‌టాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. 7వ తేదీన పోలీసులు బాలుడి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స‌మ‌స్తిపూర్ స‌దార్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

అయితే అక్క‌డ పోస్టుమార్టం అనంత‌రం.. డెడ్‌బాడీని అప్ప‌గించాలంటే రూ. 50 వేలు ఇవ్వాల‌ని ఓ ఉద్యోగి డిమాండ్ చేశాడు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఆ బాలుడి త‌ల్లిదండ్రులు జోలె ప‌ట్టి అడుక్కున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. స‌మ‌స్తిపూర్ స‌దార్ హాస్పిట‌ల్ ఉన్న‌తాధికారుల‌కు వీడియోలు చేర‌డంతో వారు స్పందించారు. త‌క్ష‌ణ‌మే బాలుడి డెడ్‌బాడీని అత‌ని ఇంటికి పంపించేశారు. ఈ ఘ‌ట‌న‌పై కమిటీ ఏర్పాటు చేసి, విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు. విచార‌ణ అనంత‌రం లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)