Bihar Rains: వీడియో ఇదిగో, అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న గంగానది, అప్రమత్తమై పాట్నాలో 76 స్కూళ్లను ఆగస్టు 31 వరకు బంద్ చేసిన అధికారులు
ఈ భారీ వర్షాలకు బీహార్ రాష్ట్రంలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు బీహార్ రాష్ట్రంలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకూ మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవలే పాట్నా సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గంగా నదిలో పడి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వీడియో ఇదిగో, మక్కా క్లాక్ టవర్‌పై మీద ఉరుములు మెరుపులు, అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్లు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)