Cat Theft In Hyderabad: రూ. 50 వేల పిల్లిని ఎత్తుకుపోయిన దొంగలు.. హైదరాబాద్ లో కేసు నమోదు
హైదరాబాద్ లో ఒక విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని దొంగిలించడంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
Hyderabad, Jan 10: హైదరాబాద్ (Hyderabad) లో ఒక విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని (Cat) దొంగిలించడంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసులు (Police) వెల్లడించిన వివరాల ప్రకారం... వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి ఒక అరుదైన జాతికి చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. దానికి ఏమాత్రం లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. దానికి నోమనీ అనే పేరు పెట్టుకున్నాడు. దీని వయసు 18 నెలలు. ఈ పిల్లి కళ్లలో ఒకటి గ్రీన్, మరొకటి బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ పిల్లి ప్రత్యేకత ఇదే. దీన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఎత్తుకుపోయారు. దీంతో, తన పిల్లిని ఎత్తుకుపోయారంటూ మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)