Cow Capture Gone Wrong in Vadodara: వీడియో ఇదిగో, ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, అర కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన గోమాత, బాధితుడికి తీవ్రగాయాలు
గుజరాత్ వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ కార్మికుడు మహేష్ పటేల్ ను ఒక ఆవు సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గుజరాత్ వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ కార్మికుడు మహేష్ పటేల్ ను ఒక ఆవు సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్టోబర్ 9న, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ బృందానికి చెందిన మహేష్ ఒక ఆవును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆవును బంధించే సమయంలో తాడు అతడి కాలుకు చిక్కుకుంది. భయాందోళనలో ఆ ఆవు రోడ్డుపై పరుగులు తీసింది. ఇతర పశువులు కూడా భయంతో సంచరిస్తూ వెళ్లడం వల్ల మహేష్ తీవ్ర గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ అంతర్గత దర్యాప్తు ఆదేశించింది. అలాగే, పశువులను పట్టుకోవడానికి పాటించాల్సిన భద్రతా విధానాలు, పద్ధతులపై సమీక్ష చేపట్టారు. స్థానికులు, ఆ ప్రాంత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ సంఘటన ప్రజలకు తెలుసు కావడంతో వీడియో వైరల్ అయ్యింది.వీడియోలో మహేష్ కాలుకు తాడు చిక్కుకుని ఆవుతో కలిసి రోడ్డుపై పరుగులు తీసే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
మృతదేహాన్ని కూడా వదలని కామాంధుడు, మార్చురీలోనే మహిళ మృతదేహంపై లైంగిక దాడి, నిందితుడు అరెస్ట్
Cow Capture Gone Wrong in Vadodara:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)