Romance On Bike: రన్నింగ్ బైక్‌ పై అసభ్యకర చేష్టలతో రెచ్చిపోయిన ప్రేమజంట.. ఢిల్లీలో ఘటన.. వీడియో వైరల్

తప్పు అని తెలుసు. ప్రాణాలకు ప్రమాదం అని కూడా తెలుసు. అయినా రన్నింగ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏదో పొడిచేశామని రొమాన్స్ చేయడం మాత్రం యువకులు మానడం లేదు.

Credits: Twitter

Newdelhi, July 17: తప్పు అని తెలుసు. ప్రాణాలకు ప్రమాదం అని కూడా తెలుసు. అయినా రన్నింగ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ (Fuel Tank) పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏదో పొడిచేశామని రొమాన్స్ (Romance) చేయడం మాత్రం యువకులు మానడం లేదు. ట్రెండ్ (Trend) అనుకున్నారో లేక థ్రిల్ (Thrill) అనుకున్నారో లేక ఫ్యాషన్ అనుకున్నారో కానీ.. కొందరు ప్రేమికులు బరి తెగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సమీపంలోని మంగోల్ పురీ ఓఆర్ఆర్ ఫ్లై ఓవర్ పై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న బైక్ పై రొమాన్స్ చేసింది. నడిరోడ్డుపై వాహనాలు రద్దీగా ఉన్న సమయంలో ఆ జంట రొమాన్స్ లో మునిగితేలింది. బైక్ నడుపుతున్న యువకుడు తన ప్రియురాలిని తనకు ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఓవైపు బైక్ నడుపుతూనే మరోవైపు రొమాన్స్ చేశాడు. ఇద్దరూ హగ్గులు, కిస్సుల్లో మునిగి తేలారు. ఆ సమయంలో ఆ రోడ్డుపై వాహనాల రద్దీ ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా ఘోర ప్రమాదం జరగడం ఖాయం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ATM Withdraw: 8 వేల కోసం విత్ డ్రా చేస్తే.. ఆరు వందలే.. హైదరాబాద్ మల్లాపూర్‌ లోని ఏటీఎంలో సాంకేతిక లోపం.. వినియోగదారుల గగ్గోలు (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement