Delhi Crackers: సుప్రీంకోర్టు నిషేధాన్ని పక్కనపెట్టి ఢిల్లీ వాసుల పటాకుల మోత.. ఆంక్షల అమలులో అధికారులు విఫలమయ్యారన్న పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి

నిషేధిత రసాయనాలతో తయారు చేసిన పటాకులపై నిషేధం విధిస్తూ నవంబర్ 7న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పలువురు ఢిల్లీ వాసులు పక్కనపెట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పటాకులను కాల్చారు.

Representational image (Photo Credits: ANI)

Newdelhi, Nov 13: నిషేధిత రసాయనాలతో తయారు చేసిన పటాకులపై (Crackers) నిషేధం విధిస్తూ నవంబర్ 7న సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలను పలువురు ఢిల్లీ (Delhi) వాసులు పక్కనపెట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పటాకులను కాల్చారు. షాపూర్ జాట్, హౌజ్ ఖాస్ ప్రాంతాల్లో పటాకుల మోత వినిపించింది. ఆంక్షలు ఉన్నప్పటికీ పటాకులు పేల్చడంపై పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి స్పందించారు. తన నివాస ప్రాంతం డిఫెన్స్ కాలనీలో కూడా పటాకులు పేలినట్లు ఆమె చెప్పారు. డిఫెన్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదులు చేసినా ఎలాంటి మార్పు రాలేదని, పటాకుల పొగలో సుప్రీంకోర్టు లక్ష్యం ఎగిరిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. హెచ్చరికలు, పూర్తి నిషేధం ఆంక్షలు ఉన్నప్పటికీ అమలు చేయడంలో అధికారులు మరోసారి విఫలమయ్యారని ఆమె అభిప్రాయపడ్డారు.

CM KCR Meetings: నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు.. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ సభ

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement