Delhi Crime: ఇల్లు శుభ్రం చేసే విషయంలో దంపతుల మధ్య గొడవ.. మాటామాట పెరగడంతో భర్త చెవి కొరికేసిన భార్య.. ఢిల్లీలో ఘటన
ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన భర్త కుడి చెవిని కొరికింది. అనూహ్య పరిణామంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు భార్యపై కేసు పెట్టాడు. ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది.
Newdelhi, Nov 27: ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన భర్త కుడి చెవిని కొరికింది. అనూహ్య పరిణామంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు భార్యపై కేసు పెట్టాడు. ఢిల్లీలోని (Delhi) సుల్తాన్ పురి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. నవంబర్ 20న ఉదయం 9.20 గంటల సమయంలో ఇంట్లోని (House) చెత్త పడేయడానికి బయటకు వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేయాలని చెప్పినా ఆమె పట్టించుకోలేదని చెప్పాడు. పైగా అకారణంగా తనతో గొడవ పడిందని, ఇల్లు అమ్మి సగం వాటా ఇస్తే పిల్లలతో వేరు కాపురం పెడతానని డిమాండ్ చేసిందని ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ ముదురుతుండడంతో ఆమెను పక్కకు నెట్టి బయటకు వెళ్తుండగా వెనుక నుంచి పట్టుకొని కుడి చెవిని బలంగా కొరికిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)