Dwarf Couple Marriage: క్యూట్ కపుల్..మూడు అడుగుల వరుడుతో రెండు అడుగుల వధువు పెళ్లి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు
బెంగళూరుకు చెందిన మూడు అడుగుల వరుడు విష్ణు (28), వధువు కోలారుకు చెందిన రెండు అడుగుల వధువు జ్యోతి (25). బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరిలోనూ వయసుకు తగ్గట్టు శరీర పెరుగుదల లోపించింది. ఇప్పుడు ఈ కొత్త జంటను (Dwarf Couple Marriage) చూసిన వారంతా క్యూట్ కపుల్ అంటూ మురిసిపోతున్నారు.
మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న ఆంగ్ల సామెత ఈ జోడిని చూస్తే అర్థమవుతుంది. బెంగళూరుకు చెందిన మూడు అడుగుల వరుడు విష్ణు (28), వధువు కోలారుకు చెందిన రెండు అడుగుల వధువు జ్యోతి (25). బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరిలోనూ వయసుకు తగ్గట్టు శరీర పెరుగుదల లోపించింది. ఇప్పుడు ఈ కొత్త జంటను (Dwarf Couple Marriage) చూసిన వారంతా క్యూట్ కపుల్ అంటూ మురిసిపోతున్నారు. కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో (Kaivar Shree Kshetra) ఆదివారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరుకు చెందిన విష్ణు, కోలార్‌కు చెందిన జ్యోతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరిద్దరూ బెంగళూరులో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరికి గత కొంతకాలం నుంచి వారి కుటుంబాలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ వీరూ మరగుజ్జులు కావడంతో అందరూ తిరస్కరించారు. విష్ణు కుటుంబానికి జ్యోతి గురించి తెలిసింది. జ్యోతిని పెళ్లి చేసుకునేందుకు విష్ణు సిద్ధమయ్యాడు. అలా ఈ దంపతులు పెళ్లి పీటలెక్కారు. ఈ యువ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)