Indigo Airlines: ఇండిగో విమానంలో రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. ముంబై నుంచి రాంచీ వెళుతున్న విమానంలో ఘటన
ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. సీకేడీ, ట్యూబరిక్యులోసిస్ తో సతమతమవుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు.
Hyderabad, Aug 22: ఇండిగో విమానంలో (Indigo Plane) ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని మరణించారు. ముంబై (Mumbai) నుంచి రాంచీకి (Ranchi) బయలుదేరిన విమానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. సీకేడీ, ట్యూబరిక్యులోసిస్ తో సతమతమవుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు. దీంతో, పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీగా నాగ్‌పూర్ లో దించేశారు. ఎయిర్‌పోర్టు నుంచి బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)