Elephants Last Rituals: మనుషుల్లాగే చనిపోయిన బిడ్డకు ఏనుగులు అంత్యక్రియలు చేస్తాయి.. మరణించిన పిల్ల ఏనుగు ముందు గట్టిగా ఏడుస్తాయ్.. గొయ్యి తీసి పూడ్చి, తర్వాత నీటిలో స్నానాలు చేస్తాయ్.. తాజా అధ్యయనంలో వెల్లడి
బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయట. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.
Hyderabad, Mar 3: మనుషులకు (Humans) ఉన్నట్టే ఏనుగులకు (Elephants) కూడా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయట. బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయట. ఈ మేరకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన బిడ్డ ఏనుగును చూసిన తల్లి ఏనుగు, తండ్రి ఏనుగు ఆ మృతదేహాన్ని తొండం, ముందరి కాళ్లతో నెమ్మదిగా తడుముతూ గట్టిగా రోదిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఆ తర్వాత మానవ సంచారం లేని ప్రాంతంలో గోతిని తవ్వి.. పిల్ల ఏనుగు ముందరి కాళ్లు పైకి కనిపించేలా ఉంచి నెమ్మదిగా కప్పి పెడుతుంది. ఆ తర్వాత దగ్గర్లోని నీటిలో ఏనుగుల గుంపు స్నానాలు ఆచరిస్తాయి. పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన ప్రాంతానికి ఇంకెప్పుడూ ఆ గుంపు రాబోదని పరిశోధకుల బృందం తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)