Vijayawada, Mar 3: ఏపీలో (Andhrapradesh) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేడి రాజుకుంది. 'సిద్ధం' (YSRCP Siddham)పేరిట ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అధికార వైఎస్సార్సీపీ.... ఎన్నికల మేనిఫెస్టో(Ysrcp Manifesto) విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 10న మేనిఫెస్టోను ప్రకటించనుంది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించ తలపెట్టిన నాలుగో ‘సిద్ధం’ మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల మందితో ఈ సభను నిర్వహించనున్నామని తెలిపారు.
వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్.. https://t.co/J4jRmdhjvN#YSRCPManifesto #SiddhamMeeting #CMJagan #Vijayasaireddy
— Asianetnews Telugu (@AsianetNewsTL) March 3, 2024
మేనిఫెస్టోపై ఆసక్తి
వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకే (Welfare Schemes) పెద్ద పీట వేసింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఈ మేనిఫెస్టోనే ఒక కారణమని విశ్లేషకులు అంటారు. ఇదే తరహాలో ఈసారి కూడా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉండనుందని సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మార్గాలకు ఈసారి మేనిఫెస్టోలో ప్రాథాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ఊతం అందించే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందని సమాచారం.