New CEO For Twitter: మరో ఆరు వారాల్లో ట్విటర్‌కు కొత్త సీఈఓ.. కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న మహిళ.. ప్రస్తుత సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటన
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ కు కొత్త సీఈవో రానున్నారు. మరో 6 వారాల్లో కొత్త సీఈఓగా ఓ మహిళ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Newdelhi, May 12: ప్రముఖ సామాజిక మాధ్యమం (Social Media) ట్విటర్ (Twitter) కు కొత్త సీఈవో (New CEO) రానున్నారు. మరో 6 వారాల్లో కొత్త సీఈఓగా ఓ మహిళ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ (Elon Musk) స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప.. మరే ఇతర విషయాన్ని మాత్రం మస్క్ స్పష్టంగా చెప్పలేదు. ట్విటర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తాను చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీఓ), ప్రాడక్ట్, సాఫ్ట్‌వేర్ విభాగాల బాధ్యతలు చూసుకోనున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)