Viral Video: జైల్లోనే ఖైదీని ముద్దు పెట్టుకున్న జడ్జి, సోషల్ మీడియాలో వీడియో వైరల్, విచారణకు ఆదేశించిన అర్జెంటీనా సుప్రీంకోర్టు న్యాయమూర్తి

దక్షిణ చుబుట్‌ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడిని జైల్లో ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది.

Woman-judge-fell-in-love-with-her-own-court-murder

దక్షిణ చుబుట్‌ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడిని జైల్లో ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది. ఇందులో ఓ పోలీస్‌ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్‌ అనే ఖైదీని న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది:

కాగా 2009లో పోలీస్‌ అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్‌ని బస్టోస్‌ హత్య చేశాడు. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్‌లో మారియల్ కూడా ఉన్నారు. బస్టోస్‌కు జీవిత ఖైదుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక న్యాయమూర్తిగా ఆమె నిలిచారు. బస్టోస్‌ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసింది. బస్టోస్‌ను రక్షించడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో అతడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. మరోవైపు మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now