Food Poisoning in Girls Hostel: హైదరాబాద్‌లోని లేడిస్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 50మందికి అస్వస్థత, ఆరుగురి పరిస్థితి విషమం
50 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హాస్టల్ యాజమాన్యం తరలించింది
హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో ఉన్న మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 50 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హాస్టల్ యాజమాన్యం తరలించింది. ఫుడ్ పాయిజన్ బారినపడ్డ 50 మంది విద్యార్థినుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.గత ఆదివారమే ఈ ఘటన జరిగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న తల్లీబిడ్డలను ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)