Two Classmates To Be Army And Navy Chiefs: దేశ చరిత్రలో తొలిసారి, భారత ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా ఇద్దరు క్లాస్‌మేట్స్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠిల కథ ఇదే..

భారతదేశ సైనిక చరిత్రలో తొలిసారి ఇద్దరు సహ విద్యార్థులు ( Classmates As Army, Navy chiefs) ఆర్మీ, నేవీ ఛీఫ్‌లయ్యారు. ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించగా... ఈ ఏడాది మే 1న నేవీ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు.

Lt General Upendra Dwivedi and Admiral Dinesh Tripathi (Photo/ANI)

Two classmates to be chiefs of Army and Navy: భారతదేశ సైనిక చరిత్రలో తొలిసారి ఇద్దరు సహ విద్యార్థులు ( Classmates As Army, Navy chiefs) ఆర్మీ, నేవీ ఛీఫ్‌లయ్యారు. ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించగా... ఈ ఏడాది మే 1న నేవీ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి క్లాస్‌మేట్స్‌. వారిద్దరూ కలిసి మధ్యప్రదేశ్‌లోని సైనిక్ స్కూల్‌ రేవాలో 1970 లో 5వ తరగతిలో జాయిన అవ్వగా అప్పటి నుంచి 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు.వారి రోల్‌ నంబర్లు 931, 938 అని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.  భార‌త ఆర్మీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఉపేంద్ర ద్వివేది, ఇంత‌కీ ఎవ‌రీ మ‌నోజ్ పాండే...పూర్తి వివ‌రాలివే!

భారత సైనిక చరిత్రలో మొదటిసారి ఆర్మీ, నేవీ చీఫ్‌లు ఒకే పాఠశాలకు చెందిన వారని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సైనిక్‌ స్కూల్‌ రేవాలో క్లాస్‌మేట్స్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి 50 ఏళ్ల తరువాత ఆర్మీ, నేవీకి నాయకత్వం వహించే స్థాయికి చేరారని పేర్కొన్నారు. ఇద్దరు అద్భుతమైన విద్యార్థులు ఈ స్థాయికి రాణించిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్‌కు దక్కుతుందని ప్రశంసించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now