Divorce for Saree: ‘నాకు నచ్చిన చీరలే కట్టుకోవాలి’ ఒత్తిడి తీసుకొచ్చిన భర్త.. ‘నచ్చని చీరల్ని కట్టుకోను’ తెగేసి చెప్పిన భార్య.. విడాకులకు దారితీసిన గొడవ.. ఆగ్రాలో ఘటన
తనకు నచ్చిన చీరలే కట్టుకోవాలని ఆ భర్త పంతంపట్టాడు. నేను మనిషినే.. నాకు కూడా కొన్ని ఇష్టాలు, అభిప్రాయాలు ఉంటాయ్. నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాననేది ఆ భార్య ఆవేదన. చివరకు ఈ చీరల లొల్లి కోర్టుకెక్కింది. విడాకుల దాకా వెళ్లింది.
Agra, Mar 3: తనకు నచ్చిన చీరలే (Sarees) కట్టుకోవాలని ఆ భర్త (Husband) పంతంపట్టాడు. నేను మనిషినే.. నాకు కూడా కొన్ని ఇష్టాలు, అభిప్రాయాలు ఉంటాయ్. నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాననేది ఆ భార్య ఆవేదన. చివరకు ఈ చీరల లొల్లి కోర్టుకెక్కింది. విడాకుల (Divorce) దాకా వెళ్లింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన ఓ జంటకు ఈ వింత సమస్య ఎదురైంది. కుటుంబ సభ్యులు, పోలీసులు సద్దిచెప్పినా సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో దీపక్, అతని భార్య విడాకులు కోరుతూ.. ఆగ్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)