Free Bus for Women: రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు మార్గదర్శకాలు జారీ.. ఆధార్‌ కార్డును చూపిస్తే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదట!

మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది.

TSRTC bus (Photo-Video Grab)

Hyderabad, Dec 8: మహిళలకు (Women) టీఎస్‌ ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free Bus Travel) కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్‌ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమావేశానంతరం తుది మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఈ పథకం అమలుపై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తమిళనాడు, కర్ణాటకలో టీఎస్‌ఆర్టీసీ ఐదుగురు అధికారుల బృందం పర్యటించింది. ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి మరికొద్దిసేపట్లో పూర్తి నిబంధనలు తెలియబోతున్నాయి.

KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement