Gujarat High Court: కేసులో సీరియస్‌గా వాదనలు, కూల్ డ్రింక్ తాగుతూ జడ్జికి దొరికిన పోలీస్, అసహనానికి గురైన న్యాయమూర్తి, 100 కూల్ డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని పోలీసు అధికారికి ఆదేశాలు
గుజరాత్ ఆన్‌లైన్ హియరింగ్‌లో ఓ పోలీసు అడ్డంగా బుక్కయ్యారు. ఓ కేసు విషయంలో మంగళవారం కోర్టులో సీరియస్‌గా జరుగుతోంది. వాది, ప్రతివాది లాయర్ల మధ్య వాదనలు సాగుతున్నాయి. ఆ హియరింగ్ మధ్యలో ఓ పోలీసు కూల్ డ్రింక్ తాగుతూ జడ్జికి కనిపించారు.
గుజరాత్ ఆన్‌లైన్ హియరింగ్‌లో ఓ పోలీసు అడ్డంగా బుక్కయ్యారు. ఓ కేసు విషయంలో మంగళవారం కోర్టులో సీరియస్‌గా జరుగుతోంది. వాది, ప్రతివాది లాయర్ల మధ్య వాదనలు సాగుతున్నాయి. ఆ హియరింగ్ మధ్యలో ఓ పోలీసు కూల్ డ్రింక్ తాగుతూ జడ్జికి కనిపించారు. దాంతో ఆ న్యాయమూర్తి అసహనానికి గురయ్యారు. దాంతో ఆ పోలీసుకు వినూత్న శిక్ష విధించారు. ఆన్‌లైన్‌లో కేసు విచారణ మధ్యలో కూల్ డ్రింక్ తాగుతున్నఇన్‌స్పెక్టర్ ఏఎం రాథోడ్‌ని గుర్తించిన చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ మందలించారు.
అంతేకాదు బార్ అసోసియేషన్‌కు 100 కూల్ డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని ఆ పోలీసు అధికారిని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తానని చెప్పారు.ఈ సంభాషణ చాలా సరదాగా సాగిందని ఆ విచారణలో పాల్గొన్న ఓ లాయర్ వెల్లడించారు. కాగా తనతోపాటు మరికొందరు అధికారులు ట్రాఫిక్ జంక్షన్‌లో ఇద్దరు మహిళలను కొట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నిమిత్తం ఇన్‌స్పెక్టర్ కోర్టుకు హాజరయ్యారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)