Gurugram: మద్యం కొనుగోలులో 50 శాతం డిస్కౌంట్, రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే..,హర్యానా గురుగ్రామ్‌లో బంపరాఫర్ పెట్టిన బార్, పబ్ యజమానులు
సోమవారం( జూన్ 21) గురుగ్రామ్ జిల్లాలో 30 వేల మందికి మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను ఎంకరేజ్ చేసేందుకు పలు మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు కష్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున‍్నాయి.
హర్యానా గురుగ్రామ్ లో కరోనా డ్రైవ్ కొనసాగుతుండగా.. సోమవారం( జూన్ 21) గురుగ్రామ్ జిల్లాలో 30 వేల మందికి మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను ఎంకరేజ్ చేసేందుకు పలు మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు కష్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున‍్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తూనే.. క‍్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సింగిల్ టీకా వేయించుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్, రెండు టీకాలు వేయించుకున్న వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఈ ఆఫర్ పై ఓ పబ్ డైరక్టర్ 'వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రోత్సహించినట్లు ఉంటుంది. బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ల కృషికి అభినందనలు తెలుపుతూ అంబిఎంచె మాల్ యాజమాన్యం స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఐడీ కార్డ్ ఉంటే ఫ్రీ కార్ పార్కింగ్ సర్వీస్ తో పాటు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నామని మాల్ ప్రతినిధి గీతా చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)