New Delhi, JAN10: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి రిపబ్లిక్ డే సేల్‌ను (Realme Republic Day Sale) ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. వివిధ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు (Realme Smart phones), ప్రొడక్టులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ డీల్స్ కంపెనీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. రియల్‌మి పీ2ప్రో 5జీ ఫోన్ రూ.5వేల తగ్గింపు పొందవచ్చు. రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ(Realme Nazo 70 TURBO), రియల్‌మి జీటీ 7ప్రో సేల్ సమయంలో భారీ తగ్గింపు ధరలకు పొందవచ్చు. రియల్‌మి రిపబ్లిక్ డే సేల్ స్పెషల్ సేల్ ద్వారా రియల్‌మి బడ్స్ టీ310, రియల్‌మి బడ్స్ టీ110పై కూడా రూ. 500 తగ్గింపు పొందవచ్చు.
రాబోయే రియల్‌మి రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రియల్‌మి పీ2 ప్రో 5జీ ఫోన్ ధర రూ. 17,999కు తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ సాధారణ ప్రారంభ ధర నుంచి రూ. 4వేలు తగ్గింది. అదేవిధంగా, రియల్‌మి జీటీ 7ప్రో ప్రారంభ ధర రూ. 59,999 నుంచి ధర రూ. 54,999కు పొందవచ్చు.
16జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 65,999 నుంచి రూ. 59,999కు కొనుగోలు చేయొచ్చు. రియల్‌మి 14ఎక్స్ ఫోన్ రూ. వెయ్యి తగ్గింపుతో ప్రారంభ ధర రూ.13,999కు కొనుగోలు చేయొచ్చు. రాబోయే సేల్‌లో రియల్‌మి 13 ప్రో ప్రారంభ ధర రూ. 26,999 నుంచి రూ.23,999కు పొందవచ్చు.
రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ బేస్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 16,999 నుంచి రూ. 14,499కి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రియల్‌మి జీటీ 6టీ ఫోన్ ధర రూ. 30,999 నుంచి రూ. 23,999కు తగ్గింది. ఈ ఫోన్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 39,999 నుంచి రూ. 29,999కు పొందవచ్చు. రియల్‌మి 13 ప్లస్ 5జీ ప్రారంభ ధర రూ. 20,999 నుంచి రూ. 16,999కు పొందవచ్చు. రియల్‌మి బడ్స్ ఎయిర్ 6కి రూ. 500 తగ్గింపుతో రూ. 3,299కు బదులుగా ధర రూ. 2,799కి అందుబాటులో ఉంది.
అదేవిధంగా, రియల్‌మి బడ్స్ టీ310 ధర రూ. 2,199 నుంచి రూ.1,999కి విక్రయించింది. రియల్‌మి బడ్స్ టీ110 ధర రూ. 1,499 నుంచి రూ. 1,099కి తగ్గింది. రియల్‌మి రిపబ్లిక్ డే సేల్ జనవరి 13న లైవ్ కానుంది.
అధికారిక రియల్‌మి వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా జనవరి 19 వరకు కొనసాగుతుంది. కొనుగోలుదారులు రిటైల్ స్టోర్ల ద్వారా రియల్‌మి జీటీ 7 ప్రోపై డిస్కౌంట్లను పొందవచ్చు. రియల్‌మి 14ఎక్స్, రియల్‌మి 13ప్రో 5జీపై డిస్కౌంట్లు స్టోర్ల ద్వారా చేసే కొనుగోళ్లకు పరిమితం అవుతుంది.