Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్, స్కై టవర్ వద్ద గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది.

New Zealand Welcomes New Year 2025 With Firework (Photo Credits: X/@ColtonBlakeX)

2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాలో మన కంటే ఐదున్నర గంటల ముందు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మన పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు నూతన సంవత్సరంలోకి అడుగుపెడతాయి.

ఈ ఏడాది చివరి సూర్యాస్తమయం వీడియోలు ఇవిగో, 2025వ ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రపంచదేశాలు

ఇక రేపు ఉదయం మనకు 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు. గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న.... పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. సౌదీ అరేబియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.

New Zealand’s Auckland First Major City To Welcome 2025 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now