Bengaluru: నడివీధిలో నిలిచిపోయిన హెలికాఫ్టర్.. మీరు చదివింది నిజమే.. బెంగళూరులో వెలుగు చూసిన దృశ్యం.. భారీగా ట్రాఫిక్ జాం

బెంగళూరు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్ సమస్యే. ట్రాఫిక్ జాంలు అక్కడ నిత్యకృత్యం. అయితే, తాజాగా ఓ హెలికాఫ్టర్ కారణంగా బెంగళూరులో ట్రాఫిక్‌ కు భారీ అంతరాయం ఏర్పడింది.

Credits: X

Bengaluru, Sep 9: బెంగళూరు (Bengaluru) పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్ (Traffic) సమస్యే. ట్రాఫిక్ జాంలు (Traffic jam) అక్కడ నిత్యకృత్యం. అయితే, తాజాగా ఓ హెలికాఫ్టర్ (Helicopter) కారణంగా బెంగళూరులో ట్రాఫిక్‌ కు భారీ అంతరాయం ఏర్పడింది. నగరంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కార్యాలయానికి సమీపంలో రోడ్డు మధ్యలో ఈ హెలికాఫ్టర్ ల్యాండయ్యింది. దీంతో, రహదారిపై వాహనాలు చాలా సేపు నిలిచిపోయాయి. ఓ సాధారణ కారో, మరో వాహనం లాగానో హెలికాఫ్టర్ రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now