Credits: X

Vijayawada, Sep 9: స్కిల్ డెవలప్‌ మెంట్ కుంభకోణంలో (Skill Development Scam) తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడును (Chandrababu Naidu) పోలీసులు (Police) అరెస్ట్ (Arrest) చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. టిఫిన్ అనంతరం చంద్రబాబును విజయవాడ తరలించేందుకు సీబీఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తతో నంద్యాలలో కలకలం రేగింది.

G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో

G-20 in India: ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఎజెండాలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే..

టీడీపీశ్రేణుల నిరసనలు

టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా పరిణామాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలు చేపట్టాయి.