Newdelhi, Sep 9: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 (G-20) దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ (Delhi) వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులుగా ఉన్నాయి. వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే జీ-20లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కర్తవ్యపథ్, ఇండియా గేట్ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను అధికారులు నిషేధించారు. వచ్చే మూడు రోజుల్లో ఢిల్లీ విమానాశ్రయ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాస సర్వీసులను రద్దు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సదస్సు జరిగే పరిసర ప్రాంతాలలో కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌ను మోహరించారు.
Here's the full schedule of #G20Summit2023#G20India2023 #G20Summit https://t.co/MmwW9oq8YQ
— Hindustan Times (@htTweets) September 9, 2023
available for the experience and draws inspiration from India's diverse cultural heritage.Its shape is derived from the conch shell,which is a symbol of auspiciousness and spirituality in Indian culture.#BharatMandapam#G20Summit#G20Summit2023 pic.twitter.com/p13KTlM1XQ
— Anand Gehlot (@AnandGehlot07) September 9, 2023
సెక్యూరిటీ భళా
అమెరికా, ప్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి అగ్ర దేశాధి నేతలతోపాటు ఇతర దేశాల ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తంగా జీ 20 కూటమిలోని 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంక్ లాంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నిన్ననే భారత్ చేరుకున్నారు. దీంతో ఢిల్లీలో హైసెక్యూరిటీ మోహరించారు. 5 వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
అజెండా అంశాలు ఇవే
అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్ డెవలప్ మెంట్, వాతావరణ మార్పులు, వేగవంతమైన సుస్థిర అభివృద్ధి, వ్యవసాయం, ఆహార వ్యవస్థ, సాంకేతిక మార్పులు, 21 శతాబ్ధికి బహు పాక్షిక సంస్థలు, మహిళా సాధికారితతో అభివృద్ధి వంటి అంశాలే అజెండాగా జీ20 సదస్సు సాగనుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.