Huge Rush at Srishalam: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం.. పాతాళగంగలో పుణ్య స్నానాలు (వీడియో)

వరుస సెలవులు రావడంతో శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. దీంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటలకుపైగా సమయం పట్టింది.

Huge Rush at Srishalam (Credits: X)

Srishailam, Dec 16: వరుస సెలవులు రావడంతో శ్రీశైలం (Srishailam) మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భారీగా భక్తులు (Devotees) తరలిరావడంతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. దీంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటలకుపైగా సమయం పట్టింది. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలను జరిపారు. కాగా సాయంత్రం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు.

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now