Hyderabad Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హైదరాబాద్ పోలీసులు ఏం చేశారో తెలుసా, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌ ఫోటోలనే వాడేశారు

హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్లో ఫన్నీ ఇమేజెస్ ట్వారా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పిస్తున్న సంగతి విదితమే. పాపులర్‌ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు చెబుతూ వారిని చైతన్యవంతం చేస్తుంటారు.

HYderabad Traffic Rules

హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్లో ఫన్నీ ఇమేజెస్ ట్వారా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పిస్తున్న సంగతి విదితమే. పాపులర్‌ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు చెబుతూ వారిని చైతన్యవంతం చేస్తుంటారు. తాజాగా క్రికెట్ ఫోటోతొ వారు ఈ సారి ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌ మధ్య జరిగిన సరదా సంఘటనలు ఫోటోలను షేర్‌ చేస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు, హెల్మెట్‌ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు.

ఇందులో మొదటి ఫోటోలో రోహిత్‌ గ్రౌండ్‌లో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. రెండో దానిలో రోహిత్‌ దినేష్‌ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్‌ ఉంది. ఈ రెండిటిని హైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్‌ ధరించి ట్రాఫిక్ రూల్స్‌ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్‌ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్‌ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now