Hyderabad: షాకింగ్ వీడియో, పోలీసుల ముందే బైక్‌ని తగలబెట్టిన వాహనాదారుడు, కారణం రాంగ్ రూట్లో వెళుతుంటే పోలీసులు ఆపారట

హైదరాబాద్‌ పోలీసులకు ఓ వాహనదారుడు ఝలక్‌ ఇచ్చాడు. పోలీసులు బైక్‌ ఆపారని ఏకంగా.. తన బైక్‌ ను తగలబెట్టాడు. ఈ ఘటన మైత్రివనం కూడలి దగ్గర చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bike Set Fire (Photo-Video grab)

హైదరాబాద్‌ పోలీసులకు ఓ వాహనదారుడు ఝలక్‌ ఇచ్చాడు. పోలీసులు బైక్‌ ఆపారని ఏకంగా.. తన బైక్‌ ను తగలబెట్టాడు. ఈ ఘటన మైత్రివనం కూడలి దగ్గర చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎల్లారెడ్డి గూడకు చెందిన అశోక్‌ అనే వ్యక్తి.. మైత్రివనం కూడలి వైపునకు వచ్చాడు. అయితే.. అశోక్‌ రాంగ్‌ రూట్‌ లో వెళ్లడంతో.. పోలీసులు అశోక్‌ ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్‌… తన ద్విచక్ర వాహనాన్ని తానె పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో పోలీసులు షాక్‌ గురయ్యారు. ప్రస్తుతం అశోక్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now