U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది, జనవరి 19న వెస్టిండీస్‌తో వరల్డ్ కప్ వేటను ప్రారంభించనున్న భారత్
రెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో రెండో ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
రెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో రెండో ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్.. గ్రూప్-ఏలో మలేషియా, వెస్టిండీస్, శ్రీలంకలో తలపడాల్సి ఉంది.
గ్రూప్-బీ లో ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్‌ఏ.. గ్రూప్-సీ లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, సమోవ, క్వాలిఫయర్ (ఆఫ్రికా రీజియన్ నుంచి) ఉండగా గ్రూప్-డీ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, క్వాలిఫయర్ (ఆసియా రీజియన్ నుంచి) చోటు దక్కించుకున్నాయి. ఈ టోర్నీ తొలి ఎడిషన్ (2023)లో షఫాలీ వర్మ సారథ్యంలోని యువ భారత జట్టు ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వినేశ్ ఫోగట్ ఎప్పుడూ మాకు ఛాంపియనే, ప్రజల హృదయాలను గెలచుకుందన్న తల్లి ప్రేమలత
బ్యూమస్ ఓవల్ వేదికగా జనవరి 31న రెండు సెమీస్‌లు జరుగనుండగా ఫిబ్రవరి 2న ఫైనల్ పోరు జరుగనుంది. టీమ్‌ఇండియా సెమీస్ చేరితే రెండో సెమీఫైనల్స్ ఆడే అవకాశముంది. సెమీస్, ఫైనల్స్‌కు రిజర్వ్ డే లు ఉన్నాయి.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)