Anand Mahindra: స్ట్రీట్ పెర్ఫార్మర్ డ్యాన్స్ ప్రతిభకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా, నిన్ను ఎవరూ ఆపలేరంటూ ప్రశంసల జల్లు, మహీంద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొనాలని పిలుపు
ఢిల్లీలో మహీంద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్ ఈవెంట్స్‌లో వరుణ్ ప్రోగ్రామ్ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు.
హర్యాణాకి చెందిన వరుణ్ యువకుడికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. శబ్ధానికి తగ్గట్టుగా నర్తించడం అంటే ఇష్టం. కానీ అదే అతనికి కష్టాలను కొని తెచ్చింది. సంగీతం, డ్యాన్సులంటూ పని చేయకుండా పరువు తీస్తున్నాడని ఉన్న ఊరూ, కన్న తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో.. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వచ్చేశాడు. అక్కడ కన్నాట్ ప్లేస్‌లో ఫుట్‌పాత్‌పై తన కళను ప్రదర్శిస్తూ బతికేస్తున్నాడు. ఈ స్ట్రీట్ పెర్ఫార్మర్ ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యాడు . డ్యాన్స్‌లో మనందరం భాగమే. డ్యాన్స్ ద్వారా నీ భావ వ్యక్తీకరణను ఇకపై ఎవ్వరూ ఆపలేరు. అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. జాతీయ మీడియా ప్రసారం చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మహీంద్రా గ్రూపు కల్చరల్ విభాగం హెడ్ జయ్ ఏ షాని లైన్‌లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీంద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్ ఈవెంట్స్‌లో వరుణ్ ప్రోగ్రామ్ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)