Devara Promotions: సోషల్ మీడియాని ఊపేస్తున్న దేవర, ప్రమోషన్స్ బిజీలో జూనియర్ ఎన్‌టీఆర్, ఈ రోజు విడుదల కానున్న ట్రైలర్
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దేవర ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దేవర ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. టికెట్స్ అన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయి రికార్డ్ క్రియేట్ చేశాయి. సినిమా రిలీజ్ కావడానికి ముందే అక్కడ వన్ మిలియన్ (పది లక్షలు) 'దేవర' టికెట్స్ సేల్ అయ్యాయి. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ మార్క్‌ను వేగంగా అందుకున్న సినిమాగా 'దేవర' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అక్కడ ఈ రికార్డ్ అందుకోలేదు. సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో ఇదిగో, వినాయక చవితి వేడుకల్లో చిన్నపిల్లలతో కలిసి చిందేసిన బాలీవుడ్ హీరో
దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. ముంబైలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. తెలుగు, తమిళ్,కన్నడ,మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)