Emergency Trailer Out: ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎలా చూపించబోతున్నారు, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ ఇదిగో..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా మూవీ వస్తోంది, ప్రధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా మూవీ వస్తోంది, ప్రధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్, ప్రత్యేక పూజలు, దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ
ఇక ఈ మూవీలో లీడ్ రోల్‌లో నటించడమే కాకుండా కంగన స్వయంగా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే నటించారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు
Here's Trailer