Kerala Police: రైల్వే ప్రయాణికుడిని కాలితో తన్నిన పోలీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్, పోలీసుపై సస్పెన్షన్ వేటు వేసిన కేరళ పోలీస్ ఉన్నతాధికారులు
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దీనిపై స్పందించి ఆ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేశారు. కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావళి ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నాడు.
రైలులో ఓ ప్రయాణికుడిని కేరళ పోలీస్ కాలితో తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దీనిపై స్పందించి ఆ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేశారు. కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావళి ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడిపై దాడికి దిగాడు. ప్రయాణికుడు మద్యం తాగి ఉన్నాడని ఆ కానిస్టేబుల్ భావించాడు. అతడి పక్కటెముకలపై కానిస్టేబుల్ తన్నాడు. దీంతో ఆ ప్రయాణికుడు కిందపడిపోయాడు. ఈ దృశ్యాలను రైలులోని ఓ వ్యక్తి స్మార్ట్ ఫోనులో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేశారు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)